షూటింగ్‌లకు అనుమతి ఇవ్వండి

షూటింగ్‌లకు అనుమతి ఇవ్వండి
x
Talasani Srinivas Yadav
Highlights

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ లను జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని పలు ఛానల్ల ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కోరారు.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ లను జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని పలు ఛానల్ల ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కోరారు. నగరంలోని మాసాబ్‌ ట్యాంక్‌లో గల పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో శనివారం వీరంతా మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా ఛానల్ల ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇండ్లలోనే సమయం గడుపుతున్నారని తెలిపారు. వారికి వినోదాన్ని పంచేందుకు కొత్త కార్యక్రమాలను అతి తక్కువ సిబ్బంధితో రూపొందిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

లాక్ డౌన్ కారణంగా ఎన్నో వినోద కార్యక్రమాల షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు బోర్ కొట్టకుండా కొత్త కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అనుమతులు ఇవ్వాల్నారు. దీంతో స్పందించిన మంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 5వ తేదీన జరిగే క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ లు ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories