నగరంలో నోరూరించే శ్రీవారి లడ్డూ..

నగరంలో నోరూరించే శ్రీవారి లడ్డూ..
x
Highlights

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది తిరుమల లడ్డు. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది తిరుమల లడ్డు. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. ఈ లడ్డూనే తీసుకోవాలంటూ ఖచ్చితంగా తిరుమలకు చేరుకుని ఆ మలయప్ప స్వామి వారి దర్శనం చేసుకుని తీసుకోవాలి. చాలా మందికి ఈ లడ్డూ తినాలని ఉన్నా తిరుమలకు వెళ్ల లేక లడ్డూ తీసుకునే భాగ్యానికి నోచుకోరు.

కానీ ప్రస్తుతం తిరుమలకు వెళ్లకుండానే లడ్డూని స్వీకరించే ఏర్పాట్లను టీటీడీ ప్రత్యేక అధికారి రమేశ్‌ చేసారు. ఈ రోజు నుంచి అంటే ఈ ఆదివారం నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం హైదరాబాద్‌లో లభించేట్టు ఏర్పాట్లు చేసారు. నగరంలోని హిమాయత్ నగర్‌లో ఉన్న టీటీడీ కార్యాలయం ( బాలాజీ భవన్‌లో) వీటిని విక్రయించనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లడ్డూ విక్రయం ప్రారంభించిన ఆదివారం ఒక్కరోజే 10 వేల లడ్డూలను విక్రయిస్తామని చెప్పారు. ఇప్పటికే 40 వేల లడ్డూలను తిరుమల నుంచి హైదరాబాద్‌కు పంపించినట్లు వెల్లడించింది.

లాక్‌ డౌన్‌ కారణంగా ఎంతో మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోలేక, శ్రీవారి తీర్ధ ప్రసాదాలు పొందలేక పోతున్న భక్తులకు మలయప్ప ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతోనే ఇందుకు శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ధరను రూ. 50 నుంచి రూ. 25 తగ్గించామన్నారు. లడ్డూ కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో ఆరు రోజులుగా లడ్డూ విక్రయాలు 13 జిల్లాల్లో చేస్తున్నారు. ఈఆరు రోజుల్లోనే లడ్డూ ప్రసాదాలను సుమారుగా 13 లక్షల మంది భక్తులు కొనుగోలు చేశార‌ని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో లడ్డూ అమ్మకానికి ప్రభుత్వం సంప్రదింపులు జరిపామని ఆ తరువాతే మే 31 నుంచి హైద‌రాబాద్‌లోని హిమాయ‌త్ న‌గ‌ర్ టీటీడీ ఆఫీసులో ల‌డ్డూల‌ను విక్రయించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories