13 వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..ఆర్టీసీ సమ్మెలోకి ఓయూ విద్యార్థీ జేఏసీ

13 వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..ఆర్టీసీ సమ్మెలోకి ఓయూ విద్యార్థీ జేఏసీ
x
Highlights

ఆర్టీసీ సమ్మె ఇవాళ్టికి 13 వ రోజుకు చేరుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధూం ధాం కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. పెద్ద సంఖ్యలో...

ఆర్టీసీ సమ్మె ఇవాళ్టికి 13 వ రోజుకు చేరుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధూం ధాం కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. పెద్ద సంఖ్యలో కార్మికులను తరలించి తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకుముందే జేఏసీ ప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయించారు. చర్చల విషయంలో సర్కారు తీరుపై మరోసారి చర్చ జరపనున్నారు. తమ డిమాండ్ల సాధనలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చించనున్నారు.

ఇక ఇవాళ్టి నుంచి ఆర్టీసీ సమ్మెలోకి ఓయూ విద్యార్థులు ప్రవేశించనున్నారు. ఇవాళ ఓయూ జేఏసీ ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఓయూ గేట్లను మూసేశారు. బయటి వారిని లోనికి అనుమతించడం లేదు. అలాగే ప్రగతిభవన్‌ దగ్గర కూడా పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories