56 రోజుల తరువాత తెలంగాణలో రైట్..రైట్.. షరతుల మధ్య ప్రయాణం!

56 రోజుల తరువాత తెలంగాణలో రైట్..రైట్.. షరతుల మధ్య ప్రయాణం!
x
Highlights

దాదాపుగా 56 రోజుల తర్వాత తెలంగాణలో బస్సులు మళ్ళీ రోడ్డేక్కాయి. నిన్న(సోమవారం) సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన

దాదాపుగా 56 రోజుల తర్వాత తెలంగాణలో బస్సులు మళ్ళీ రోడ్డేక్కాయి. నిన్న(సోమవారం) సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ పలు సడలింపులను ఇచ్చారు. అందులో భాగంగానే బస్సులు ఉదయం ఆరు గంటలకే మొదలవుతాయాని కేసీఆర్ వెల్లడించారు. అయతే ఇందులో కొన్ని కండిషన్స్ పెట్టారు. కచ్చితంగా ఈ కండిషన్స్ ని పాటించాలని లేకపోతే మళ్ళీ కరోనా కేసులు పెరిగితే మళ్లీ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ఇంతకి ప్రజారవాణాలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏంటో తెలుసుకుందాం..

31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతూనే అన్ని జిల్లాల్లో బస్సులు నడుస్తాయని, హైదరాబాద్‌లో మాత్రం సిటీ బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా MGBSకి బస్సులు రావని, JBSకి మాత్రం వస్తాయని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాదులో ఆటోలు, టాక్సీలకు అనుమతి కల్పించారు. ఇందులో టాక్సీల్లో డ్రైవర్‌తో కలిపి నలుగురు, ఆటోలో డ్రైవర్‌తో కలిపి ముగ్గురు ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ నిబంధనలని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మాత్రం పోలీసులు చలానా విధిస్తారని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. ఇకా ప్రయాణికులు కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని, లేకపోతే వేయి రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఈరోజు నుంచి నడిపే ప్రతీ బస్సును ముందుగానే శానిటైజ్ చేస్తుంది. శానిటైజర్ లేని ప్రయాణికులకు బస్టాండ్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులు బస్సులో నిలుచొని ప్రయాణం చేసే అవకాశం లేదు.. ఇక ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 లోపే డిపోలకు చేరాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. సోషల్ డిస్టాన్సింగ్ పక్కగా అమలయ్యేలా బస్సుల్లో తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. ఇక ప్రజల మీదా భారం పడకుండా బస్సు చార్జీలను పెంచలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లవు. రాష్ట్ర పరిధిలోనే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో బస్సులు జూన్ నుంచి తిరిగే అవకాశం ఉంది.

నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీనగర్ దగ్గర ఆపగా, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సుల్ని ఆరాంఘర్ దగ్గర ఆపుతారు, ఇక వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ దగ్గర ఆపగా, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సుల్ని JBS దగ్గర అపనున్నారు. మొత్తం తెలంగాణలో 10460 బస్సుల్లో 6082 బస్సులు ప్రస్తుతం రోడ్డేక్కనున్నాయని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories