ఎలక్ట్రిక్ బస్సులకు కొత్త ఆపరేటర్లు

ఎలక్ట్రిక్ బస్సులకు కొత్త ఆపరేటర్లు
x
Highlights

ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తక్కువ జనాభా వున్న రూట్లలో బస్సులను రద్దు చేసింది. దాంతో పాటుగానే పాత బస్సులు కూడా తీసేసింది.

ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తక్కువ జనాభా వున్న రూట్లలో బస్సులను రద్దు చేసింది. దాంతో పాటుగానే పాత బస్సులు కూడా తీసేసింది. ఈ నేపథ్యంలోనే నగరంలో దాదాపు 4000 మందికి పైగా ఉద్యోగాలు ఖాళీ ఏర్పడ్డాయి. అందులో కొంతమంది కండక్టర్లను వివిధ జిల్లాలకు తనిఖీలకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంత మందిని ఇతర డిపార్ట్‌మెంట్లకు బదిలీ చేశారు.

ఇంకొంత మందిని కార్గో సేవలకు ఎంపిక చేశారు. అయినా డ్రైవర్ లకు మాత్రం పోస్టులను సర్దుబాటు చేయలేకపోయారు. కాగా కొంత మందిని ఖాళీగా ఉంచుతూ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి నెలా ఈ భారం గ్రేటర్‌ ఆర్టీసీకీ తడిసి మోపడవుతున్నది. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్టీసి ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే నగరంలో ప్రవేశపెట్టిన బ్యాటరీ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించడానికి ఆర్టీసీ డ్రైవర్లను నియమించనున్నారు.

ఈ బస్సులను ప్రస్తుతం నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నడుస్తున్నాయి. ఈ బస్సులకు ఖాళీగా వున్న ఆర్టీసి డ్రైవర్లను ఆపరేటర్ల లాగా బాధ్యతలను అప్పగించ నున్నారు. ప్రస్తుతం బాధ్యతలలో వున్న ప్రైవేటు డ్రైవర్లను విధులనుంచి తొలగించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణాలు వున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొంత మంది ప్రయివేటు డ్రైవర్లు టికెట్ల విషయంలో కొంత చేతివాటం చూపిస్తున్నారని తెలిపారు. ఈ నేపద్యంలో ఆపరేటర్లతో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. దీంతో ఆపరేటర్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీకి దాదాపు రూ.14 కోట్ల వరకు జీతాల భారం తగ్గనుంది. అంతే కాకుండా డైవర్ల చేతివాటం కూడా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగడుతుందని అధికారులు తెలుపుతున్నారు.

దీంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుంటుందని. ఆర్టీసీ డ్రైవర్లు ఇటువంటి చేతివాటం ప్రదర్శించరని ఆర్టీసీ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సర్‌ప్లస్‌గా ఉన్న డ్రైవర్లకు కూడా పనికల్పించినట్లు అవుతుందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories