Top
logo

ఆర్టీసీ కార్మికులకు తీవ్ర హెచ్చరిక..సమ్మెలో పాల్గొంటే డిస్మిస్‌

ఆర్టీసీ కార్మికులకు తీవ్ర హెచ్చరిక..సమ్మెలో పాల్గొంటే డిస్మిస్‌
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆయన చెప్పారు....

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆయన చెప్పారు. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ ఎండీ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ఈ మేరకు నోటీసును కూడా విడుదల చేశారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. విధులకు రాకుండా సమ్మెలో పాల్గొంటే వేటు తప్పదన్నారు. డిస్మిస్ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే కొత్త వాళ్లను తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఓవైపు పిలుపునివ్వడం, మరోవైపు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్చరికలతో ఆర్టీసీ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది.

Next Story


లైవ్ టీవి