ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు

ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు
x
Highlights

ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ టికెట్లు ఇచ్చే విధానంలో మార్పులు చేసి కొత్త పద్దతిని అమలు చేయనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ టికెట్లు ఇచ్చే విధానంలో మార్పులు చేసి కొత్త పద్దతిని అమలు చేయనుంది.నేరుగా డబ్బులు తీసుకోవడం, టికెట్లను ఇవ్వడం ద్వారా కరోనా ఉన్న వారి నుంచి ఎక్కడ సిబ్బంధికి వైరస్ సోకుతుందో అన్న ఉద్దేశంలో గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్‌ చార్జీలను చెల్లించేలా టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటుగానే ప్రస్తుతం కర్ణాటకలో అమలవుతున్న క్యూఆర్‌కోడ్‌ విధానాన్ని కూడా ఇక్కడ అమలు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ విధానంలో క్యూఆర్‌కోడ్‌ ఆధారంగా టికెట్ కు సరిపడా డబ్బులను చెల్లించవచ్చు. ఈ విధానాన్ని మొదటిదశలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు దక్షిణమధ్య రైల్వే కాగితరహిత అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్ల విక్రయానికి యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా జరిపే టికెట్‌ బుకింగ్‌లో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో యూటీఎస్‌ యాప్‌ ద్వారా స్టేషన్‌ పరిసరాల్లో ఉన్నవారు, కిలోమీటర్‌ పరిధిలోని ప్రయాణికులుటికెట్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. సత్వరం టికెట్ల కొనుగోలుకు గాను క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను జోన్‌ పరిధిలో అన్ని స్టేషన్లలో అమల్లోకి తెచ్చినట్లు శనివారం వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories