ఆర్టీసీ మరింత కష్టాల్లో పడింది

ఆర్టీసీ మరింత కష్టాల్లో పడింది
x
Highlights

కరోనా భయం మరోవైపు మండుతున్న ఎండల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆక్యుపెన్సీ గడచిన కొద్ది...

కరోనా భయం మరోవైపు మండుతున్న ఎండల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆక్యుపెన్సీ గడచిన కొద్ది రోజులుగా పడిపోతూ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతుంటే. ఒక్కోసారి పదిమంది ప్రయాణికులతోనే బస్సులను నడపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత కష్టాల్లో పడింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 58 రోజుల పాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు గత వారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేశారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ లోకి అనుమతిచ్చారు. అయినా ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనబడటం లేదు. రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండటం, మరోవైపు కరోనా కేసులు రెట్టింపు అవుతుండటంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

ఆర్టీసీ లో మూములు రోజుల్లో 65-70 మధ్య ఓఆర్ వస్తుంది. ప్రస్తుతం కరోన ప్రభావం తో హైదరాబాద్ రావాలంటే ప్రజలు జంకుతున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ మినహ ప్రతి రోజు 6000 బస్సులు నడుస్తున్నాయి. అయినప్పటికి ప్రయాణికులు రాకపోవడం వల్ల 39ఓఆర్ మాత్రమే వస్తుంది. ప్రతి రోజు 12 కోట్ల ఆదాయం వస్తుండేది. పెళ్ళిళ్ళ సీజన్ లో 15 కోట్ల వరకు ఆదాయం వచ్చేది కాని ప్రస్తుతం కేవలం 4-5 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది దీంతో ఆర్టీసీ కి తీవ్ర నష్టాలు వస్తున్నాయని అదికారులు వాపోతున్నారు.

ఒక్కో బస్సులో 56 సీట్లు ఉంటాయి. కరోనా నేపథ్యంలో 28 మంది ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ప్రతి బస్సులో 15 నుంచి 20 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ సంఖ్య 15 మించలేదు. లాంగ్ రూట్లలో కూడా పది మందితో బస్సు నడపాల్సి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనా భయంతో ప్రయాణాలకు దూరంగా వుంటున్నట్టు అభిప్రాయపడుతున్నారు. మండుతున్న ఎండలు కూడా మరో కారణమని భావిస్తున్నారు.

ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 5 గంటల తరువాత కొంత రద్దీ బస్టాండ్ల వద్ద కనిపిస్తోంది. ఇదిలా ఉంటె కరోనా కట్టడి కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. బస్టాండ్ ప్రాంగణంలో, మూత్రశాలల వద్ద, సమాచార కేంద్రం వద్ద పెడల్‌ శానిటైజర్‌ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్సును శానిటైజ్‌ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నామని చెబుతున్నారు. బస్సు ఎక్కే ముందు డ్రైవరు, కండక్టర్‌తో సహా ప్రయాణికులందరూ తమ చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరాన్ని పాటిస్తూ బస్సులను ఎక్కి నిర్దేశించిన సీట్లల్లో మాత్రమే కూర్చొని ప్రయాణించాలని అధికారులు సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories