ఆర్టీసీలో రివర్స్ గేర్

ఆర్టీసీలో రివర్స్ గేర్
x
Highlights

ఆర్టీసీ ప్రగతి చక్రం వెనక్కి నడుస్తోంది. గ్రేటర్‌లో ఆర్టీసీ ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. గతుకుల రోడ్లు ట్రాఫిక్ ఇబ్బందులు అదనపు పనిగంటలతో...

ఆర్టీసీ ప్రగతి చక్రం వెనక్కి నడుస్తోంది. గ్రేటర్‌లో ఆర్టీసీ ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. గతుకుల రోడ్లు ట్రాఫిక్ ఇబ్బందులు అదనపు పనిగంటలతో ఒత్తిడికి గురవుతున్నారు. వేలాది మంది రిటైరైనా నియామకాలు జరుపకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. గ్రేటర్‌లో ఆర్టీసీ సిబ్బంది కష్టాలపై ప్రత్యేక కథనం.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ సిబ్బంది కష్టాలు అంతా ఇంతా కాదు గ్రేటర్‌లో వాహనాలు 55 లక్షలకు చేరుకున్నా ఆ మేరకు రోడ్ల విస్తరణ జరగడం లేదు. అయినా కొత్త కాలనీలకు, కొత్త రూట్‌లకు బస్సులు నడుపుతున్నారు. గతుకుల రోడ్లతో వెన్ను నొప్పి, నడుము నొప్పులతో అవస్థలు పడుతున్నారు. పద్మవ్యూహాన్ని తలపించే రద్దీలో పాతకాలం నాటి రన్నింగ్ బస్సులు నడుపలేకపోతున్నారు. పని భారం ఎక్కువైపోతోంది. అదనపు గంటలు పని చేయాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతిరోజు 3,500 బస్సులు 42వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఆర్డినరీ బస్సులు మూడు నిమిషాలకు ఒక కిలోమీటరు, ఎక్స్‌ప్రెస్‌లకు రెండున్నర నిమిషాలకు కిలోమీటరు చొప్పున చాలాఏళ్ల క్రితం కేటాయించిన సమయం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఒకప్పటి వాహనాల రద్దీకి ఇప్పటి వాహనాల రద్దీకి చాలా తేడా ఉంది. నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. వేతనాలు కూడా సరైన సమయానికి అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రోజు పని భారం పెరగడంతో డ్యూటీలు చేయలేక అలిసిపోతున్నారు ఆర్టీసీ సిబ్బంది. డ్యూటీ చేస్తున్న సమయంలోనే కొంతమంది మృతి చెందుతున్నారు. ఆర్టీసీలో 7 వేల మందికి పైగా రిటైరయ్యారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో మిగిలిన కార్మికులపై పనిభారం పడుతోందని ఆర్టీసీ కార్మిక యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్న కష్టాలు అదనపు పనిభారంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories