ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌
x
Highlights

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ లో తరగతులు నిర్వహించినట్టుగానే, టీఎస్‌పీఎస్సీ భాషా పండితుల సర్టిఫికేట్ లను ఆన్లైన్ లో నిర్వహించనుంది.

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ లో తరగతులు నిర్వహించినట్టుగానే, టీఎస్‌పీఎస్సీ భాషా పండితుల సర్టిఫికేట్ లను ఆన్లైన్ లో నిర్వహించనుంది.కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ లో తరగతులు నిర్వహించినట్టుగానే, టీఎస్‌పీఎస్సీ భాషా పండితుల సర్టిఫికేట్ లను ఆన్లైన్ లో నిర్వహించనుంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ తెలుగు మీడియం పోస్టుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, భాషా పండితుల నాలుగోవిడుత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ను గురువారం నుంచి ఈ నెల 12 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వెరిఫికేషన్ లో ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ ధృవీకరణ పత్రాలను అధికారుల మెయిల్ లో అప్‌లోడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

ఇకపోతే ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో పూర్తయింది. దీంతో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను జూన్‌ 15వ తేదీన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తతం బోర్డు అధికారులు స్కానింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఫలితాల ప్రాసెస్‌ చేయాల్సి ఉంది.

ముందుగా అధికారులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించేట్టుగా కనిపించక పోవడంలేదు. అయినప్పటికీ విద్యార్థులు ఇప్పటికే విద్యార్థుల అమూల్యమైన సమయం వృద్ధాకావడంతో అధికారులు రెండు సంవత్సరాల ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాని పక్షంలో జూన్‌ 15వ తేది ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసి రెండు మూడు రోజుల తరువాత మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల చేయనుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇంటర్ ఫలితాలు జూన్ 20వ తేదీలోగా రిలీజ్ కానున్నాయని తెలుస్తుంది. ఇక సప్లిమెంటరీ పరీక్షలను ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

ఇక పోతే 2020-21 విద్యాసంవత్సరంలో భాగంగా ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 తరువాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక మొదటి సంవత్సరం పరీక్షలను పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడిన తరువాత ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్దమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను రాసుకోవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా విద్యార్థుల కోసం మాక్‌ టెస్టులను అందుబాటులోకి తెచ్చామన్నారు. మోడల్‌ పేపర్లు, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టులు www.rankersl-earning.comలో పొందవచ్చని తెలిపారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories