సర్టిఫికేట్ వేరిఫికేషన్ తేదీల ప్రకటన : టీఎస్‌పీఎస్‌సీ

సర్టిఫికేట్ వేరిఫికేషన్ తేదీల ప్రకటన : టీఎస్‌పీఎస్‌సీ
x
Highlights

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీకి అభ్యర్థల సర్టిఫికెట్ వేరిఫికేషన్ తేదీలను ఖరారు చేసింది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కొన్నిపోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫలితాలలో ఉత్తర్ణత సాధించిన అభ్యర్థల సర్టిఫికెట్ వేరిఫికేషన్ తేదీలను కూడా ఖరారు చేసింది. టీఆర్‌టీ-పీఈటీ (తెలుగు మాధ్యమం), జిహెచ్‌ఎంసి బిల్ కలెక్టర్, ఆర్‌టిసి జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ మరియు బేవరేజెస్ కార్పొరేషన్‌లోని అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌తో సహా వివిధ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ ల వేరిఫికేషన్ తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) శనివారం ప్రకటించింది.

పోస్ట్లులను భర్తీకి సర్టఫికేట్ వేరిఫికేషన్ను 1:3 నిష్పత్తిలో చేపడతామని తెలిపారు. పీఈటి పోస్టులకు ఎంపికైన సుమారు 71 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ల ధృవీకరణ కోసం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని ప్రతిభా భవన్ వద్ద హాజరుకావాలని తెలిపారు. నవంబర్ 15 న ఉదయం 10 గంటలకు జిహెచ్‌ఎంసి బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ మరియు బేవరేజెస్ కార్పొరేషన్‌లోని అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ , డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ధృవీకరణ పత్రాలను తీసకుని హాజరుకావాలని తెలిపారు. ఆర్థిక విభాగంలో ఒక పోస్టు, గ్రూప్ -2 న్యాయ విభాగానికి చెందిన మూడు పోస్టులు మొత్తం నాలుగు పోస్టులకు సంబంధించిన వేరిఫికేషన్ నవంబర్ 18 ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులందరూ సకాలంలో సర్టిఫికేట్ వేరిఫికేషన్ కు రావాలని అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories