టెన్త్ విద్యార్ధులకు గ్రేడింగ్‌ ఇలా..

టెన్త్ విద్యార్ధులకు గ్రేడింగ్‌ ఇలా..
x
Highlights

రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాను, ఇటు విద్యార్ధుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ సోమవారం పదో తరగతి పరీక్షల...

రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాను, ఇటు విద్యార్ధుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ సోమవారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతుండడంతో ఇప్పటికే పది పరీక్షలను ప్రభుత్వం రెండుసార్లు వాయిదా వేసింది. ఇంతకింతకీ కేసులు పెరిగిపోతుండడంతో పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

ముందుగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పది పరీక్షలను రద్దు చేసిన సర్కార్ మళ్లీ ఓ సారి పునరాలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా పది పరీక్షలను రద్దు చేసింది. విద్యార్ధులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఏం రాయాలి, ఏం చదవాలి అని గందరగోళంలో ఉన్న 5,34,903 మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలలుగా పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక సతమతమువుతున్న వారికి కాస్త మరశ్శాంతి లభించింది. ఈ విధంగా పదో తరగతి పరీక్షలు రద్దు కావడం ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విషేశం.

గ్రేడింగ్‌ ఇలా..

పది పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి పదో తరగతిలో విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణతను సాధించనున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే గ్రేడింగ్ విషయానికొస్తే ప్రతి ఏడాది విద్యాశాఖ ఒక విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టింది. ఇక అదే విధంగా వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి, 20 మార్కులు ఇంటర్నల్స్‌కు ఇచ్చింది.

ఇంటర్నల్స్‌లో ఒక్కో ఎఫ్‌ఏకు 20 మార్కుల (ప్రతి సబ్జెక్టులో) చొప్పున నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి. ఐదు మార్కులకు ప్రతి సబ్జెక్టులో ప్రతి ఎఫ్‌ఏ మార్కులను పాఠశాలలు కుదిస్తాయి. ఇలా పూర్తిగా 20 నుంచి 5 మార్కులకు కుదిస్తాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జూలై, ఆగస్టు, నవంబర్, 2020 జనవరిలలో ఎఫ్‌ఏలను నిర్వహించగా ఆయా పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్‌ మార్కులను స్కూళ్లు పరీక్షల విభాగానికి పంపాయి. ప్రతి సబ్జెక్టులో అలా వచ్చిన 20 మార్కులను విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులుగా పాఠశాలలు పదో తరగతి పరీక్షల విభాగానికి పంపుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇంటర్నల్స్‌లో 20కి 20 మార్కులు వేస్తుండటారు. దీంతో 80 శాతం మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించనుంది.

ఒక్కో విద్యార్థికి ప్రతి సబ్జెక్టలో ఉన్న 20 ఇంటర్నల్‌ మార్కులను 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి గణితంలో ఇంటర్నల్‌ మార్కులు 20కి 20 వేసి ఉంటే అతనికి గణితంలో 100 మార్కులతో ఏ–1 గ్రేడ్‌ (10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌–జీపీఏ) వస్తుంది. అలాగే అన్ని సబ్జెక్టుల్లో ఏ–1 వస్తే 10/10 జీపీఏ వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్‌లో 18 మార్కులే వస్తే అతనికి 90 మార్కులు వచ్చినట్లు లెక్క. దాని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్‌తో 9 పాయింట్‌ జీపీఏ వస్తుంది. మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్‌ కేటాయిస్తారు.

ఇప్పటివరకు టెన్త్‌లో అమలు చేస్తున్న గ్రేడింగ్‌ విధానం.. (హిందీ మినహా)...

గ్రేడ్‌ మార్కుల పరిధి జీపీఏ

ఏ1 91–100 10

ఏ2 81–90 9

బీ1 71–80 8

బీ2 61–70 7

సీ1 51–60 6

సీ2 41–50 5

Show Full Article
Print Article
More On
Next Story
More Stories