Top
logo

ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ నిషేధం

ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ నిషేధం
X
Highlights

చాలా మంది వాహనదారులు తమకు అత్యవసర పరిస్థితులలో పెట్రోల్ ఉండాలన్న ఉద్దేశంతో వారు ప్లాస్టిక్ బాటిళ్ల లో పెట్రోల్ ను నిలువ చేసుకుంటారు.

చాలా మంది వాహనదారులు తమకు అత్యవసర పరిస్థితులలో పెట్రోల్ ఉండాలన్న ఉద్దేశంతో వారు ప్లాస్టిక్లో బాటిళ్ల లో పెట్రోల్ ను నిలువ చేసుకుంటారు. బయటికి ఎక్కడికయినా వెళ్లిన్నపుడు వాహణాలలో పెట్రోల్ ఖాళీ అయితే దగ్గరలో ఎక్కడయినా పెట్రోల్ బంకు ఉంటే అక్కడి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో తీసుకొస్తారు. అంతే కానీ వాహనాలను తోసుకుంటూ పోలేరు కదా. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కారణాల వలన ఈ సౌకర్యాన్ని తొలగించింది.

ముఖ్యంగా ఇటీవల, అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి హత్య కేసులో, నిందితుడు తన కార్యాలయానికి ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ తీసుకెళ్లి దాన్ని తహశీల్దార్ పై పోసి ఆమెను హతమార్చాడు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో సంచలనాన్నే సృష్టించింది. విజయా రెడ్డి ఘటన జరిగిన తరువాత చాలామంది రైతులు ప్రభుత్వ అధికారులను అదే పద్ధతిలో బెదిరిస్తున్నారని సీఎంకు సమాచారం రావడంతో ప్రభుత్వ అధికారులకు భద్రత కల్పించడానికి, ప్రభుత్వం ఈ నిషేధ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సంఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పెట్రోల్ బంకులోనూ పెట్రోల్ ను ప్లాస్టిక్ బాటిల్లలో పోయకూడదని సైన్ బోర్డులను ఏర్పాటు చేయించింది.Next Story