తెలంగాణలో షెడ్యూల్ లోపే మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో షెడ్యూల్ లోపే మున్సిపల్ ఎన్నికలు
x
Highlights

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 19న ఎన్నికల నోటిపికేషన్ విడుదల...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 19న ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 10న ఓటర్ల జాబితా రిజర్వేషన్లు ఖరారు చేసి 12వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగా ఐదు మున్సిపల్ ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణలో షెడ్యూల్ లోపే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది ఎన్నికల కమిషన్ కొత్త షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 10న ఓటర్ల జాబితా., రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈనెల 12వ తేదీ లోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితా పరిగణలోకి తీసుకుని ఓటర్ జాబిత రెడీ చేస్తామన్నారు.

ఎన్నికల నిర్వాహణపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు ఎన్నికల కమిషనర్. ఓటర్ల జాబితాను మరో ఐదు రోజుల వరకు గడువు పెంచాలని రాజకీయ పార్టీలు సూచించాయి రాజకీయ పార్టీలకు అనువుగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఎన్నికల ఖర్చు రెండు లక్షలకు పెంచకుండా లక్ష రూపాయలకే పరిమితం చేయాలని వామపక్ష నేతలు కోరారు. ఎన్నికల నిర్వహణలో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలకు 119 రోజుల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును రాతపూర్వకంగా కోరినా రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సవరణకు 14 రోజుల సమయం ఎలా సరిపోతుందని బీజేపీ ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సిద్దం చేయకుండా. పోలీంగ్ బూత్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు ఓటర్లజాబితా డ్రాఫ్ట్ కు సమయం సరిపోదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మున్సిపాల్టీలతో పాటు ఎన్నికలు లేని జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. బీసీల జనాబా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఈసీని కోరారు.

ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ స్వాగతించింది. అయితే ఎన్నికల నిర్వహాణ వ్యయం రెండు లక్షలకు పెంచాల్సిన అవసరం లేదన్న ప్రతిపక్ష పార్టీల నిర్ణయాన్ని టీఆర్ఎస్ అంగీకరించింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఐదు మున్సిపల్ చట్టాలను తీసుకు రానుంది సర్కార్. మున్సిపాల్ చట్టం, జిహెచ్ఎంసి తోపాటు ఇతర కార్పోరేషన్లు, హెచ్ఎండిఎ తోపాటు ఇతర అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకు, డైరెక్టరేట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ చట్టలను అర్డీనేన్స్ ను తీసుకురానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories