Top
logo

18, 19న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. ఎందుకంటే..

18, 19న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. ఎందుకంటే..
Highlights

తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుపనుంది. ఈనెల 18, 19 తేదీల్లో సమావేశాలు...

తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుపనుంది. ఈనెల 18, 19 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం కానుంది. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం కోసం ఈ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త మున్సిపల్ చట్టం కోసం ఈ నెల 18న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందజేస్తారు.

దాని మీద చర్చించడానికి ఒకరోజు సమయం ఇచ్చి 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రశ్నోత్తరాలు, అసెంబ్లీ ప్రోసిడింగ్స్ లాంటివి ఏమి ఉండవు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయ శాఖకు పంపించినట్లు చెప్పారు.

Next Story