ఎంఐఎంతో పోత్తు నిజామాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం

ఎంఐఎంతో పోత్తు నిజామాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం
x
Highlights

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. ఆయా పార్టీల అధిష్టానం నుంచి పేర్లు సీల్డు కవర్ లో రావడంతో...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. ఆయా పార్టీల అధిష్టానం నుంచి పేర్లు సీల్డు కవర్ లో రావడంతో చివరి నిమిషం వరకు సస్పెన్స్ తలపిస్తూ వచ్చింది. ఎవరికి పదవి వరిస్తుందో అన్న టెన్షన్ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా కనిపించింది. అనూహ్యంగా కొన్ని చోట్ల చైర్మన్ పదవి వస్తుందనుకున్న వారి పేర్లు తలకిందులు కావడంతో చేసేది ఏమీ లేక నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాటు ఆరు మున్సిపాలిటిలను గులాబి పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పోరేషన్ లో టిఆర్ఏస్ కు పూర్తిస్తాయి మోజార్టీ రాకున్న ఎంఐఎంతో పోత్తు, ఏక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మేయర్ పీఠంన్ని కైవసం చేసుకుంది.

నిజాబామాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఏన్నిక అయిన 60మంది కార్పోరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు అధికారులు ఆ తర్వాత మేయర్ ,డిప్యూటి మేయర్ ఏన్నిక జరిగింది. మేయర్ గా దండు నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎంకు చెందిన ఎండి ఇద్రీస్ ను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ కు చెందిన 13 మంది సభ్యులు, ఎంఐఎం కు చెందిన 16 మంది కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు, స్వతంత్ర అభ్యర్ధితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు మద్దతు ప్రకటించారు. బిజెకి 28మంది సభ్యులతో పాటు ఏంపి ఓటుతో 29కి సంఖ్యబలం ఆగిపోయింది.

ఆర్మూర్ మున్సిపాలిటి చైర్మన్ పండిత్ వినిత, వైస్ చైర్మన్ గా మున్ను బాయ్ ఏన్నికయ్యారు. బోధన్ మున్సిపాలిటి చైర్మన్ గా తూము పద్మ,వైస్ చైర్మన్ బోదన్ ఏమ్మేల్యే సోదరుడు సోయేల్ ఏన్నికయ్యారు. బాన్సువాడ మున్సిపాలిటి చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ గా జుబేర్ ఏన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన బీంగల్ మున్సిపాలిటి చైర్మన్ గా మల్లెల రాజశ్రీ ,వైస్ చైర్మన్ భగత్ ఏన్నికయ్యారు. కామారెడ్డి చైర్ పర్సన్ గా కుమారి జాహ్నవి,వైస్ చైర్మన్ గా ఇందు ప్రియ ఏన్నికయ్యారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కుడుముల సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ గా ముస్త్యాల సుజాత ఏన్నికయ్యారు.

నిజామాబాద్ కార్పోరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటిలపై గులాబి జెండా ఏగరవేయడం పట్ల జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపొందిన మున్సిపాలిటిల్లోని ప్రదాన పార్టీలకు సంబందించిన సభ్యులు క్యాంప్ ల నుంచి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులలో వచ్చారు. మొత్తంమ్మీద జిల్లా వ్యాుప్తంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories