రేపు తెలంగాణ క్యాబినేట్ సమావేశం

రేపు తెలంగాణ క్యాబినేట్ సమావేశం
x
Highlights

తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. కొత్త మున్సిపల్ బిల్లుకు క్యాబినేట్ అమోదం తెల్పనుంది. ఈ చట్టంలో మూడు పాలసీలు ఉన్నాయి.లంచాలు లేకుండా...

తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. కొత్త మున్సిపల్ బిల్లుకు క్యాబినేట్ అమోదం తెల్పనుంది. ఈ చట్టంలో మూడు పాలసీలు ఉన్నాయి.లంచాలు లేకుండా పురపాలన కొనసాగేలా చేయడమే ఈ కొత్త చట్టం లక్ష్యం. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 న జరగనున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేశారు.

కొత్త పురపాలక చట్టంలో తెలంగాణ రూరల్ , అర్బన్, రెవెన్యూ అనే మూడు పాలసీలను తీసుకువస్తుంది ప్రభుత్వం. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఉద్యోగులకు లంచాలు ఇచ్చే అవసరం లేకుండా చట్టం రూపొందించారు. కొత్త మున్సిపల్ చట్టం వల్ల పట్ణణ ప్రాంతంలో జరిగే గుణాత్మక మార్పుల గురించి మంత్రి వర్గంలో సిఎం కేసీఆర్ చర్చిస్తారు. ఆ తర్వాత బిల్లుకు క్యాబినేట్ అమోదం తెల్పతుంది. జిఎస్టీ, పంచాయితీ రాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ మొదటి సమావేశం ఏర్పాటు వంటి అర్డినెన్స్ లకు మంత్రివర్గం అమోద ముద్ర వేయనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories