కేటీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కేటీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
x
Highlights

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మంగళవారం సమావేశం...

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

అంతే కాక జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించడం ఇతర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించిట్లు సమాచారం. దాంతో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న విభజన హామీలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు కేటీఆర్ తెలిపారు. అంతకుముందు సంబంధిత మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories