నేడు టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్.. ఒక్కో మంత్రికి ఒక్కో ఎమ్మెల్సీ..

నేడు టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్.. ఒక్కో  మంత్రికి ఒక్కో ఎమ్మెల్సీ..
x
Highlights

టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తోన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు హోంమంత్రి...

టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తోన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు హోంమంత్రి మహమూద్‌ అలీ, యెగ్గ మల్లేశం, శేరి సుబాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ లు పార్టీ నుంచి బి ఫారమ్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యవేక్షించనున్నారు. వారందరు ముందుగా పది గంటలకు అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళలు అర్పించిన అనంతరం... నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఒక్కో అభ్యర్ధికి.. ఒక్కో మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టు సమాచారం.

హోంమంత్రి మహమూద్‌ అలీతో పాటు మజ్లిస్ అభ్యర్ధికి సంబందించిన నామినేషన్‌ బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించారు. ఇక యెగ్గ మల్లేశం నామినేషన్ బాధ్యతను మల్లారెడ్డికి, శేరి సుబాష్‌రెడ్డి నామినేషన్‌ బాధ్యతను వేముల ప్రశాంత్‌రెడ్డికి, సత్యవతి రాథోడ్‌ నామినేషన్‌ బాధ్యతను మంత్రి ఎర్రబెల్లికి అప్పగించారు. కాగా ఈ నెల 28 వ తేదీ వరకు నామినేషన్ల గడువు ఉంది. ఐదుగురు సభ్యులు ఏకగ్రీవం కాని పక్షంలో మార్చి 12న ఎన్నిక జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories