Top
logo

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్
Highlights

బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో...

బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, స్థానిక ఎన్నికల్లో 8 స్థానాల్లో మాత్రమే గెలిచిందని అన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. తెలంగాణలో బీజేపీకి ఉనికి లేదని, గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఒక్కరు మాత్రమే ఉన్నారని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు రమేష్. దేశంలో కేసీఆర్ లాంటి ముందు చూపు ఉన్న నేత మరొకరు లేరని చెప్పారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తే బీజేపీ తెలంగాణలో బలపడదని చెప్పారు.

Next Story