logo

హుజూర్‌నగర్‌లో విజయం తమదే అంటోన్న టీఆర్ఎస్..కేటీఆర్ చెప్పిన ఈ నినాదం..

హుజూర్‌నగర్‌లో విజయం తమదే అంటోన్న టీఆర్ఎస్..కేటీఆర్ చెప్పిన ఈ నినాదం..
Highlights

పోలింగ్ ముందు వరకు హుజూర్ నగర్లో నెగ్గుతామా అనే అనుమానంతో ఉన్న కారు పార్టీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది....

పోలింగ్ ముందు వరకు హుజూర్ నగర్లో నెగ్గుతామా అనే అనుమానంతో ఉన్న కారు పార్టీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాలో గులాబీ నేతలున్నారు. అభివృద్ధి మంత్రం హుజూర్ నగర్‌లో వర్క్ ఔట్ అయ్యిందని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ కంచుకోట హుజూర్ నగర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం కావడంతో గులాబీ పార్టీ ప్లాన్ గా ప్రచారం నిర్వహించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతిని ఓడించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే మొదట్లో గెలుపుపై కాస్త అనుమానాలు ఉన్నా ఇప్పుడు మాత్రం హుజూర్ నగర్‌లో విజయం తమదే అంటున్నాయి గులాబీ శ్రేణులు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ వ్యూహం ఫలించింది అని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చెబుతున్నారు. పద్మావతి గెలిస్తే ఉత్తమ్ ఫ్యామిలికి లాభం సైదిరెడ్డి గెలిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గానికి లాభం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళిందంటున్నారు. దీంతో చాలా శాతం మంది ఓటర్లు గులాబీ వైపు మొగ్గు చూపారని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

ఇక సైదిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారనే సానుభూతి కూడా ప్రజల్లో ఉందని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థి 18 వేల నుంచి 25 వేల మెజారిటీతో విజయం సాధిస్తారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు ధీమాతో ఉన్నారు. ఓ వైపు సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండటంతో గులాబీ శ్రేణుల్లో ధీమా పెరిగింది. మొత్తం హుజూర్‌నగర్ తమదే అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. మరి వీరి ఆశలు నిరవేరతాయా లేక అడియాశలు అవుతాయా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.


లైవ్ టీవి


Share it
Top