మంచినీటి కోసం తల్లడిల్లుతున్న తండాలు

మంచినీటి కోసం తల్లడిల్లుతున్న తండాలు
x
Highlights

రాష్ర్టంలో వర్షాలు కురుస్తన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీసం తాగునీరు లేకుండా ఉన్నపరిస్థితి నెలకొంటుంది.

రాష్ర్టంలో వర్షాలు కురుస్తన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీసం తాగునీరు, సాగునీరు లేకుండా ఉన్నపరిస్థితి నెలకొంటుంది. తాగునీటి కోసం కొన్ని మైళ్ల దూరం వెల్లక తప్పదు. తాగు నీరు లేక చాలా మంది తల్లడిల్లుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా మా బతుకులు ఇంతేనా మాకీ నీటి కష్టాలు తప్పవా అంటూ కొన్ని ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.

ఇదే తరహాలోనూ పెద్దెముల్ మండలంలోని కందనెల్లి తండాలోని ప్రజలు నీటి కష్టాలు ఎదురుకుంటున్నారు. ఆ ప్రాంత ప్రజలకు రోజు రోజుకూ నీటికష్టాలు పెరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో నివసించే వారికి త్రాగు నీరు ఒక విలువైన వస్తువుగా మారిపోయింది. ఆ ప్రాంత గిరిజనులకు రోజుకో కుండ నీరు దొరకడం గగనంగా మారింది. వారికి ప్రతిరోజూ ఒక కుండ నీరు దొరకడమే చాలా కష్టమైన పనిగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి వారు తాగునీరు కోసం అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎక్కడయినా తాగునీటి పైప్‌లైన్ లీక్ అయితే చాలు వారు తమ దాహార్తిని తీర్చకోవడానికి కుండలను నింపుకుంటున్నారు. అలా లీకయిన నీరు ఎంత మురికిగా ఉన్నాకూడా దాహాన్ని తీర్చు కునేందుకు ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా అదే నీటిని తాగుతున్నారు. అలా తాగడం మూలాన ఎంతో మంది ఆరోగ్యాలు దెబ్బతిని ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆ గ్రామంలోని ప్రజలు ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా వారు మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రజా ప్రతినిధులు స్పందించడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తండాలోని తాగునీటి సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తండా మహిళలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories