టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే భారీ మొత్తంలో జరిమానా

టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే భారీ మొత్తంలో జరిమానా
x
Highlights

టిక్కెట్ లేని ప్రయాణం నేరం అని ఎప్పటికప్పడు రైల్వేస్టేషన్లలో, బస్ స్టేషన్లలో అనౌన్స్ చేస్తూనే ఉంటారు.

టిక్కెట్ లేని ప్రయాణం నేరం అని ఎప్పటికప్పడు రైల్వేస్టేషన్లలో, బస్ స్టేషన్లలో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఇన్ని ప్రచారాలు చేసినా, ఎంత మంది స్క్వాడ్ లు టికెట్ లేని వారిని పట్టుకున్నా మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో ఈ సారి టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల ఆట కట్టించడానికి ప్రభుత్వం మంచి ఆలోచనే చేసింది. ఎవరైనా ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే వారికి బారీగానే జరిమానా విధించనుంది.

గరిష్టంగా చూసుకుంటే రూ.500 జరిమానా విధించేందుకు అధికారులు సన్నధం అవుతున్నారు. ఇది వరకు బస్సుల్లో టికెట్‌లేని ప్రయాణికులు దొరికితే ప్రయాణికుల మీద మాత్రమే కాకుండా కండక్టర్లపై కూడా బాధ్యతారాహిత్యం పేరుతో క్రమశిక్షణ చర్యలు చేపట్టేవారు. ఈ పద్దథి తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉందని, దాన్ని రద్దు చేయాలని చాలా కాలంగా కండక్టర్లు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు టికెట్‌ తీసుకోకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రయాణికులపైనే పడుతుంది. అయితే కొంత మంది కండక్టర్ లు డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం కండక్టర్లను బాధ్యులను చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories