Telangana: మానసిక పునరావాస కేంద్రం పేరుతో చిత్రహింసలు

Telangana: మానసిక పునరావాస కేంద్రం పేరుతో చిత్రహింసలు
x
Highlights

మానసిక పునరావాస కేంద్రం పేరుతో ఓ వృద్ధాశ్రమ నిర్వాహకులు మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.

మానసిక పునరావాస కేంద్రం పేరుతో ఓ వృద్ధాశ్రమ నిర్వాహకులు మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని నాగారం శిల్పానగర్ లో వృద్ధాశ్రమం పేరుతో మానసిక పునరావాస కేంద్రం నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి బాగు లేని వారిని బాగు చేస్తామని చెప్పడంతో పలువురు తమ వారిని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ.. చిత్రహింసలు పెడుతూ నరకయాతనకు గురి చేస్తున్నారు.

పది నుండి పదిహేను మంది ఉండాల్సిన గదిలో యాబై మందికిపైగా బంధించారు ఆశ్రమం నిర్వాహకులు. చెప్పిన మాట వినడటంలేదంటూ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. మానసిక పరివర్తన కల్పిస్తామని చెప్పడంతో మద్యానికి బానిసైన వారిని కూడా చేర్పించారు కొందరు. వృద్ధులతో పాటు యువకులను సైతం ఇదే ఆశ్రమంలో చేర్పించారు. 52 పురుషులతో పాటు 21 మంది మహిళలు ఈ ఆశ్రమంలో ఉంటున్నారు.

ఆశ్రమ నిర్వాహుకులు పెడుతున్న ఇబ్బందులతో ఎదురు తిరిగిన వారిని గొలుసులతో కట్టి వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.బాధిత బంధువులు ఫిర్యాదు పోలీసులు అధికారులతో కలిసి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడి విషయాలను సేకరించారు. వైద్య పరీక్షల కోసం బాధితులను తరలిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories