దేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్లలో తెలంగాణకు స్థానం

దేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్లలో తెలంగాణకు స్థానం
x
Highlights

దేశ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలోని కొన్ని పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం శాఖ టాప్ 10 బెస్ట్ పోలీస్ స్టేషన్లుగా శనివారం ఎంపిక చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలోని కొన్ని పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం శాఖ టాప్ 10 బెస్ట్ పోలీస్ స్టేషన్లుగా శుక్రవారం ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కింది. ఈ టాప్ 10 పోలీస్ స్టేషన్లలో ఎన్ని ఆస్తి తగాదాలు, మహిళలు, అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య, ఎన్ని నమోదయ్యాయి చూసి, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరించారన్న విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. అనంతరం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటామని. వీటి ఆధారంగా జాబితాను రూపొందింస్తామని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు.

శనివారం ఉదయం విడుదల చేసిన ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ తన సమర్థమైన పనితీరుతో ఈ చోటు దక్కించుకుంది. ఈ పోలీస్ స్టేషన్ కు 8వ స్థానం లభించింది. ఈ స్టేషన్లను మాత్రమే కాకుండా సమర్థంగా పనిచేసే పోలీస్ ల జాబితాను కూడా కేంద్ర హోం శాఖ ప్రకటించించింది.

ఇదిలా ఉంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్ దీన్ పోలీస్ స్టేషన్ మొదటి స్ధానంలో ఉంది. రెండో స్థానంలో గుజరాత్ లోని బాలా సినోర్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందిన అజిక్ బుర్హాన్ పూర్, నాలుగో స్థానంలో తమిళనాడుకు చెందిన ఏడబ్ల్యూపీఎస్ థేని, ఐదో స్థానంలో అరుణాల్ ప్రదేశ్ కు చెందిన అనిని పీఎస్, ఆరో స్థానంలో ఢిల్లీలోని ద్వారక, ఏడో స్థానంలో రాజస్థాన్ కు చెందిన బకాని, తొమ్మిదో స్థానంలో గోవాలోని బిచో లిమ్ ఉండగా, మధ్యప్రదేశ్ లోని బార్ గావా పదో స్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories