Top
logo

ఈదురు గాలుల బీభత్సం.. అనాథలుగా మారిన చిన్నారులు

ఈదురు గాలుల బీభత్సం.. అనాథలుగా మారిన చిన్నారులు
X
Highlights

అకాల వర్షాలు, ఈదురు గాలులు, పిడుగు పాట్లు ఎన్నో కుటుంబాలను నష్ట పరుస్తున్నాయి. పంటలు నష్టపోవడం, పశువులు చనిపోవడం మాత్రమే కాదు అక్కడక్కడా మనుషులు కూడా తమ ప్రాణాలను వదిలేస్తున్నారు.

అకాల వర్షాలు, ఈదురు గాలులు, పిడుగు పాట్లు ఎన్నో కుటుంబాలను నష్ట పరుస్తున్నాయి. పంటలు నష్టపోవడం, పశువులు చనిపోవడం మాత్రమే కాదు అక్కడక్కడా మనుషులు కూడా తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ రోజు ఈదురుగాలులు సృష్టించిన భీబత్సంలో భార్యభర్తలు మృతి చెందడంతో ఇద్దరు అమాయక ఆడపిల్లు అనాథలుగా మిగిలిపోయారు. ఈ విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్‌ మండలం మున్ననూర్‌ శివారులో చోటు చేసుకుంది.

పూర్తివివరాల్లోకెళ్తే మహబూబ్‌నగర్‌ జిల్లా మున్ననూర్‌ చెందిన డొంక కృష్ణయ్య, పుష్ప దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే పంట కోతకు రావడంతో వరి కోసి మున్ననూర్‌ శివారులో మహబూబ్‌నగర్‌ - కోదాడ హైవే టోల్‌గేట్‌ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఒక్క సారిగా ఈదురు గాలులు వీచడంతో వరిని కుప్పచేసి ఎత్తే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఉన్నట్టుంది టోల్‌గేట్‌ కుప్పకూలిపోయింది. ఆ దంపతుల తలపై భారీ ఇనుపకడ్డీలు పడిపోవడంతో అక్కడిక్కడే వారిద్దరూ మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు కూతుళ్లు దిక్కులేని వారయ్యారు. విషయం తెసుకున్న గ్రామస్థులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరు చిన్నారు రోదలను చూసి కంటతడి పెట్టుకున్నారు. అమ్మా లే, నాన్న లే అంటూ పిల్లలు గుక్కపట్టి ఏడుస్తుంటే అక్కడున్న వారి మనసులను కలిచివేసింది.

Web Titletollgate collapsed due to heavy storms caused to the death of wife and husband the children became orphans
Next Story