Top
logo

పులిని చంపి చర్మాన్ని తరలిస్తూ..

పులిని చంపి చర్మాన్ని తరలిస్తూ..
X
Highlights

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడలో పులి చర్మాన్ని తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి...

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడలో పులి చర్మాన్ని తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఇచ్చొడ మీదుగా తీసుకెళుతుండగా సమాచారం అందుకున్న అధికారులు .. పక్కగా ప్రాన్ వేసి పట్టుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌కు తరలించి విచారిస్తున్నారు. పట్టుబడిన వారిలో స్ధానికంగా ఉన్న ఆలయ పూజారి కూడా ఉన్నట్టు గుర్తించారు. పులిని వేరే ప్రాంతంలో చంపి ఇక్కడకు చర్మం తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు .

ఇచ్చొడలో తాము స్వాధీనం చేసుకున్న పులి చర్మం .. కవ్వాల్ టైగర్ జోన్‌ లోనిదేనంటున్నారు సీఎప్ ఓ శర్వనంద్. డబ్బు కోసమే పులులను చంపి ... చర్మాలను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. పులి చర్మాన్ని తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతోనే దాడి చేశామన్నారు CFO శర్వానంద్‌.

Next Story