ఆ పులి గిరిజనులకు వణుకు పుట్టిస్తోంది

ఆ పులి గిరిజనులకు వణుకు పుట్టిస్తోంది
x
Highlights

ఆ పులి గిరిజనులకు వణుకు పుట్టిస్తోంది. కాలు బయట పెడితే పంజా విసురుతుందని భయాందోళన చెందుతున్నారు. మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేస్తుండడంతో మూగ...

ఆ పులి గిరిజనులకు వణుకు పుట్టిస్తోంది. కాలు బయట పెడితే పంజా విసురుతుందని భయాందోళన చెందుతున్నారు. మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేస్తుండడంతో మూగ జీవాలు భయంతో వెనక్కి పరుగెత్తుకొస్తున్నాయి. కుమ్రంబీమ్ జిల్లాలో పులి సంచారంపై హెచ్ ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్

వాగులో సంచారిస్తున్న పులిని చూడండి. ఈ పులిని దూరం నుంచి కొందరు చూస్తున్నారు. తమపై ఎక్కడ దాడి చేస్తోందనని భయాందోళన చెందుతున్నారు. కొమ్రం భీమ్ జిల్లా అసిఫాబాద్ మండలం చిర్రకుంట ప్రాంతంలో కొద్ది రోజులు సంచరించిన ఈ పులి ఇప్పుడు తిర్యాణి మండలం అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంది. మేతకు వస్తున్న వన్యప్రాణాులు, పశువులను వెంటాడుతోంది.

తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్లడోర్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లే పశువులు పులి భయంతో వెనక్కి పరుగెత్తుకొస్తున్నాయి. పులి బారి నుంచి పశు సంపదను కాపాడాలని గిరిజనులు వేడుకుంటున్నారు. తిర్యాని మండలంలో ఓపెన్ కాస్ట్ గనుల పక్కనున్న వట్టి వాగులో పులిని కార్మికులు చూశారు. అది వాగు దాటుతుండగా సెల్ ఫోన్ లో బంధించారు. తమ క్యాంప్ వైపు వచ్చి ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడ్డారు.

మూడు రోజుల క్రితం ఓపెన్ కాస్ట్ లో మట్టిని తరలిస్తున్న టిప్పర్ కు ఎదురుగా పులి వచ్చి నిలబడింది. భయంతో డ్రైవర్ టిప్పర్ ను ఒక్కసారిగా నిలిపివేశాడు. కాసేపటి తర్వాత పులి మట్టి కుప్పల వైపు వెళ్లడంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. టిప్పర్ ను ముందుకు పోనిచ్చాడు. పులి సంచారంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో రాకపోకలు సాగించే కార్మికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

తిర్యాణి మండలంలో సంచారిస్తున్న పులి మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి స్మగ్లర్ల బారినపడకుండా, పంటలకు రక్షణగా ఉండే విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కకుండా చర్యలు చేపట్టారు. తిర్యాని ప్రాంతం నుంచి కవ్వాల్ టైగర్ జోన్ లోకి సురక్షితంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories