కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం..

కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్ నగర్ పేపర్ మిల్లులో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లులో కూలీలు పనిచేస్తున్న సమయంలో మట్టిపెళ్లలు కూలాయి.

తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్ నగర్ పేపర్ మిల్లులో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లులో కూలీలు పనిచేస్తున్న సమయంలో మట్టిపెళ్లలు కూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఐదుగురు కార్మికులు మట్టి పెళ్లల కింద 50 మీటర్ల లోతులో చిక్కుకుని గాయపడ్డారు. పేపర్ మిల్లులో కొత్తగా బాయిలర్ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

బాయిలర్ నిర్మాణ పనులు కోసం కార్మికులంతా చెన్నై నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఒక్కో షిఫ్ట్‌లో సగటున 12 మంది కార్మికులు పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 1,200 మంది పరోక్షంగా మరో 4,500 మంది తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

కాగా 2014లో మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లును 2018 ఆగస్టులో పునరుద్దరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని, ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. ఈ ప్రమాద సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూరుకుపోయిన మట్టిలో నుంచి నలుగురు కార్మికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

అనంతరం మట్టిలో మరికొంత మంది కూరుకుపోయి ఉండగా వారిని రక్షించేందుకు సహాయ బృందాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, పేపర్ మిల్లు అధికారులు తప్ప మిగతా వారిని అనుమతించడం లేదు. ఏఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories