Coronavirus: రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్.. 44కు చేరిన కేసులు

Coronavirus: రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్.. 44కు చేరిన కేసులు
x
Representational Image
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. ఈ రోజు నమోదయిన కేసుల్లో ఇద్దరు వైద్యులు ఉండడం, అందులో వారిద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. ఈ ఇద్దరు వైద్యులు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే వారికి కూడా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఇక వీరు దోమలగూడ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతవాసులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు.

ఇక కరోనా బారిన పడిన 49 ఏళ్ల మరో వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈయన నగరంలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నివాసముంటున్నారని తెలిపారు. డాక్టర్లయిన భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక పోతే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారానికి 39 ఉండగా, బుధవారం రెండు కేసులు నమోదయి 41కి చేరింది. ఇక ఈ రోజు నమోదయిన కేసులను కలుపుకుంటే 44కు చేరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories