కుటుంబాన్ని వెంటాడిన డెంగ్యూ

కుటుంబాన్ని వెంటాడిన డెంగ్యూ
x
Highlights

డెంగ్యూ ప్రజల్లో దడపుట్టిస్తోంది ఆ వ్యాధి పేరు వింటే చాలు ప్రజలు వణుకుతున్నారు. డెంగ్యూ రాకాసి దెబ్బకు కుటుంబాలు కుదేలువుతున్నాయి. ఒకే కుటుంబంలో మూడు...

డెంగ్యూ ప్రజల్లో దడపుట్టిస్తోంది ఆ వ్యాధి పేరు వింటే చాలు ప్రజలు వణుకుతున్నారు. డెంగ్యూ రాకాసి దెబ్బకు కుటుంబాలు కుదేలువుతున్నాయి. ఒకే కుటుంబంలో మూడు తరాలు రాకాసి వ్యాధి దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. మనుషుల ప్రాణాలను మింగుతున్న డెంగ్యూ వ్యాధి పై హెచ్ ఎంటీవీ ప్రత్యేక కథనం.

మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. గుడిమల్లు రాజగట్టు కుటుంబానికి జీవనాదారం. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ భార్య పిల్లలు ,తాతను పోషిస్తున్నాడు. అలాంటి పచ్చని కుటుంబంపై డెంగ్యూ వ్యాధి పగటిపట్టింది. డెంగ్యూ వ్యాధికి గురై రాజగట్టు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రాజగట్టు లింగయ్యకు డెంగ్యూ సోకి ప్రాణాలు కోల్పోయారు. తండ్రిని, తాతను మింగిన వ్యాధి కూతురు వర్షిణిని వదలలేదు. తాత చనిపోయిన వారం రోజులు రాజగట్టు కూతురు వర్షిణి ఆరు సంవత్సరాల పాప డెంగ్యూ భూతానికి బలైంది. వర్షిణి మృతితో పదిహేను రోజులలో ఒకే కుటుంబంలో మూడుతరాలకు చెందిన వాళ్లు ప్రాణాలు కోల్పోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాజగట్టు భార్య సోని సైతం డెంగ్యూ వ్యాధికి గురైంది. సోని తొమ్మిది నెలల గర్భిణి డెంగ్యూ వ్యాధి విషమించడంతో సోనిని హైదరాబాద్‌ కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. సోని ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకాసి రోగానికి ముగ్గురు బలయ్యారు. కనీసం సోని, కడుపులో ఉన్న బిడ్డను డెంగ్యూ భూతం నుండి కాపాడాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించలేదని దానివల్లే ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజగట్టు భార్య సోనికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు , జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు సర్కార్ ను కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories