లాక్ డౌన్ ఎత్తేస్తే తెలుగు రాష్ట్రాలలో తలెత్తే అతి పెద్ద సమస్య ఇదే!

లాక్ డౌన్ ఎత్తేస్తే తెలుగు రాష్ట్రాలలో  తలెత్తే అతి పెద్ద సమస్య ఇదే!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా రోజుకు పదుల కొద్దీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే లాక్ డౌన్ తో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే...

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా రోజుకు పదుల కొద్దీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే లాక్ డౌన్ తో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే పరిస్థితులున్నా అప్పటికీ కరోనా ప్రభావం తగ్గకుంటే ఏం చేయాలనేది రెండు రాష్ట్రాల అధికారులకు సమస్యగా మారింది.

లాక్ డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో చాలా మంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొందరు ఉద్యోగాలను వదిలి సొంతూళ్లకు వెళ్తే మరికొందరు ఉన్నచోటే ఉండి జీవితం సాగదీస్తున్నారు. మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇలాంటి వాళ్లంతా ప్రయాణాలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇప్పటికే అసహనంతో ఉన్న వలస కూలీలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఏపీలోని చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్ బాట పట్టడమే కాక తెలంగాణలో చిక్కుకున్న వారు ఏపీకి వెళ్లడం ప్రారంభిస్తారు. వీళ్లంతా ఒక్కసారిగా ప్రయాణాలు ప్రారంభిస్తే పరిస్థితేంటనేదే ఇప్పుడు అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటికే వలస కూలీలు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపు వారిని మరింత అసహనానికి గురి చేసింది. ఇప్పటికే చాలా మంది కాలినడకన సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మే 3 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేస్తే వీరంతా ఒక్కసారిగా సరిహద్దులు దాటే అవకాశాలున్నాయి.

ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అప్పుడు ఉండవు. సరిహద్దులు దాటి వచ్చే వాళ్లందరినీ 14 రోజుల క్వారంటైన్ లో ఉంచే అవకాశం కూడా ఉండదు. లాక్ డౌన్ ను ఎత్తివేస్తే జనం రాకపోకలను ఆపడం ఎవరి తరం కాదంటున్నారు ఏపీ అధికారులు.

ఇక హైదరాబాద్ లో కేసులు భారీగా నమోదవటంతో ఇక్కడి కంటైన్ మెంట్ జోన్లలో నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే మే 3 వరకు పరిస్థితిలో మార్పు రాకపోతే లాక్ డౌన్ ఎత్తివేత చిక్కులు తెచ్చిపెడుతుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ నుంచి చాలా మంది మళ్లీ హైదరాబాద్ కు వస్తే కరోనా విజృంభించే అవకాశాలుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories