వింత వైరస్ తో 30వేల కోళ్లు మృతి..

వింత వైరస్ తో 30వేల కోళ్లు మృతి..
x
Highlights

ఈ మద్య కాలంలో కరోనా వైరస్ సోకి చైనాలో ఏ విధంగానైతే మనుషులు చనిపోతున్నారో అదే విధంగా తెలంగాణలోనూ కోళ్లు ఏదో అంతు చిక్కని వైరస్ సోకి చనిపోతున్నాయి.

ఈ మద్య కాలంలో కరోనా వైరస్ సోకి చైనాలో ఏ విధంగానైతే మనుషులు చనిపోతున్నారో అదే విధంగా తెలంగాణలోనూ కోళ్లు ఏదో అంతు చిక్కని వైరస్ సోకి చనిపోతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం బయ్యనగూడెంలో కోళ్లు వరుసగా చనిపోతున్నాయి. దాదాపు ఇప్పటి వరకూ 30 వేల కోళ్లు చనిపోయాయని పౌల్ట్రీ యజమానులు తెలిపారు. దీంతో వారికి ఎంతో నష్టం చేకూరుతుందని యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పెద్ద పెద్ద కోళ్లఫారాల్ని ఏర్పాటు చేసి లక్షల కోళ్లను పెంచుతున్నామని, కానీ గత పది రోజుల నుంచి ఎదో వింత వ్యాధితో వేల కొలది కోళ్లు చనిపోయి పౌల్టీృ అంతా ఖాలీ అయిపోతుందని యజమానులు, తహశీల్దార్ రవికుమార్ అంటున్నారు.

ఇక పోతే చనిపోతున్న వేలకొలది కోళ్లను బయ్యనగూడెం గ్రామ సమీపంలోని అగ్రహారం గ్రామం దగ్గర్లో చెరువులో గోతులు తీసి వాటిలో వేస్తున్నారు. కానీ వాటి మీద కోళ్లపై మట్టి కప్పకపోవడంతో అక్కడున్న కుక్కలు వాటిని తీసుకెళ్లి గ్రామంలో అంతా పారేస్తున్నాయని, ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోందని వస్తోందని నాయకులగూడెం గ్రామస్థులు ఫిర్యాదు చేస్తున్నారు. చనిపోతున్న కోళ్లను గ్రామలకు దూరంగా ఎక్కడైనా కప్పిపెట్టాలని వారు కోరుతున్నారు. చైనాలో కూడా ఇదే విధంగా కోళ్లు అన్ని చనిపోతున్నాయని, అసలు కోళ్లకు వస్తున్న వైరస్ ఏంటనేది మాత్రం తెలియట్లేదని అధికారులు తెలుపుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories