సెల్ఫీ సోకుల్లో సెల్లు ఖతం..

సెల్ఫీ సోకుల్లో సెల్లు ఖతం..
x
సెల్లును దొంగలిస్తున్న దొంగ
Highlights

ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా...

ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నాము అన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. ఇదే తరహాలో ఇద్దరు మహిళలు రోడ్డుపై సెల్ఫీ దిగుతుంటే ఏం జరిగిందో తెలుసా..

హైదరాబాద్ నగరంలో ఇద్దరు మహిళలు పాపం కారు బాగుందనుకున్నారో, లేక ఆ ఇద్దరూ చాలా రోజుల తరువాత కలుసుకున్నారో తెలీదు కానీ సెల్ఫీ దిగుదామనుకుని రోడ్డుపై నిలుచుకున్నారు. వావ్ లొకేషన్ బాగుంది కదా, సెల్ఫీ బాగొస్తుంది కదా అనుకుంటూ దిగే సమయానికి హఠాత్తుగా బైక్ పై వచ్చాడు ఓ ఎరుపు చొక్కా దొంగోడు. రోడ్డుపై నిలుచున్న ఓ యువతి, మరో యువతితో కలిసి సెల్ఫీ దిగుతుంటే చేతినుంచి సెల్ ఫోన్ ను లాక్కెళ్లిపోయాడు. ఇంకే ముంది ఆమె సెల్లూ పోయింది, దిగే సెల్ఫీ కూడ పోయింది. అయినా ఆ ఇద్దరూ తమ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళుతున్న అతన్ని ఏమీ చేయలేకపోయారు.

ఈ దృశ్యాలు సమీపంలో అమర్చిన ఓ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల పోన్ లో చెక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోను చూసిన కొందరు రోడ్లపై ఈ తరహా పనులేంటని మండిపడుతుంటే, మరికొంత మంది జాగ్రత్తగా ఉండాలికదా? అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోను మీరూ చూసి ఆనందించండి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories