ఈసారి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ లేనట్టే

ఈసారి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ లేనట్టే
x
Highlights

ప్రతి ఏడు ఆర్థిక సంవత్సనం మొదటి నెలలో చాలా మంది క్రమం తప్పకుండా ఆస్తి పన్నును చెల్లిస్తుంటారు.

ప్రతి ఏడు ఆర్థిక సంవత్సనం మొదటి నెలలో చాలా మంది క్రమం తప్పకుండా ఆస్తి పన్నును చెల్లిస్తుంటారు.ఇలా చెల్లించేవారికి అధికారులు ఐదు శాతం రాయితీని ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ పేరుతో కల్పించేవారు. కానీ ఈ సారి మొదటి నెలలో ఆస్తి పన్ను చెల్లించే వారికి ఆ సౌకర్యం లేనట్టే. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా జూన్ చివరి వరకు ఆస్తి పన్ను చెల్లింపు గడువును పొడిగించడంతో ఎర్లీబర్డ్‌ ఆఫర్‌కు ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు.

ఇక పోతే గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను కట్టని వారికి వచ్చే జూన్‌ వరకు అపరాధరుసుము లేకుండా కట్టుకోవడానికి గడువు పొడిగించింది ప్రభుత్వం. దీంతో పన్ను కట్టేవారు హ్యీపీగా ఫైన్ లేకుండా పన్ను చెల్లించే అవకాశం ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సనం అంటే 2020-21కి ఆస్తిపన్నులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ ప్రారంభం అయిన మొదటి రోజే సుమారుగా 3900 మంది వ్యక్తులు రూ. రెండుకోట్ల మేర పన్ను చెల్లించారని అధికారులు స్పష్టం చేసారు.

ఇక హైదరాబాద్ నగరంలో హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్లలో ఆస్తి పన్నులు ఎక్కువ ఉంటాయి. దీంతో ప్రభుత్వం ఈ సర్కిళ్లలో వాణిజ్య భవనాలకు 15శాతం మేర, నివాస భవనాలకు 7.5శాతం పన్నులో రాయితీ కల్పించింది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక ఐదు రోజుల పాటు ఆన్ లైన్ చెల్లింపులు అన్ని సర్దుబాట్ల కోసం నిలిపివేస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వారం రోజులపాటు నిలిపివేసి బుధవారం నుంచి ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories