ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ
x
Highlights

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని కాపాడుకుంటామని సంస్థను ప్రైవేటుపరం చేయమని తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని కాపాడుకుంటామని సంస్థను ప్రైవేటుపరం చేయమని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని మంత్రి పువ్వాడ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటంలేదన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయారు. సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు. త్వరలోనే అన్ని బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు ఉన్నాయన్నారు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని కేసీఆర్‌ హామీయిచ్చారు కానీ విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. టిమ్‌ మిషన్‌లు పనిచేయకుండా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో ఆర్టీసీలో చేస్తున్న సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. 5 వతేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవాళ్లనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని ప్రకటించారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె చేస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు తిప్పుతున్నందుకు తమ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. స్కూల్‌, కాలేజీ బస్సులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories