Etela Rajender: హైదరాబాద్ లో రెడ్‌జోన్లు లేవ్..

Etela Rajender: హైదరాబాద్ లో రెడ్‌జోన్లు లేవ్..
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఐదు రెడ్‌జోన్లంటూ ప్రచారం జరుగుతోంది....

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో ఐదు రెడ్‌జోన్లంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఏలాంటి రెడ్ జోన్లు లేవని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఈ మహమ్మారిని కుటుంబ సభ్యులకు అంటగట్టారన్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''కరోనా వైరస్‌ గాలితో వచ్చే రోగం కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో వస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఒక్క బాధితుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. అనవసర సమాచారంతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారు. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన ఆరు రోజుల్లో పూర్తి చేస్తాం'' అని వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories