లక్ష విలువ చేసే మద్యం చోరీ చేసిన దుండగులు..

లక్ష విలువ చేసే మద్యం చోరీ చేసిన దుండగులు..
x
Representational Image
Highlights

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రం వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రం వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని షాపులను, రవాణా వ్యవస్థను, సినిమా హాల్లను, బార్లను అన్నింటినీ మూసివేసింది. దీంతో రాష్ట్రంలో వైన్ దొరకక మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతన్నారు. ఎంతో మంది పిచ్చి చేష్టలతో మానసిన వైద్య శాలకు క్యూ కడుతున్నారు. మరి కొంత మంది దొరక్క కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొంత మంది ఏకంగా ఎక్కడ మద్యం కనిపించినా వాటిని దొంగలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఓ వైన్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్‌లో శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ ఉంది.

లాక్ డౌన్ నేపథ్యంలో రెండు వారాల నుంచి షాప్ యజమానులు వైన్స్ ను తెరవడంలేదు. కాగా కొంత మంది గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి షాప్ వెనుక భాగంలోని రేకులను వంచి లోపలికి వెల్లి గోడకు రంధ్రం చేసారు. అలా షాప్ లో చొరబడి సుమారుగా రూ.లక్ష విలువైన పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అంతే కాక షాపు డ్రాలో ఉన్న రూ.15వేల నగదును కూడా తీసుకెల్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం షాపు వద్దకు చేరుకుని షాపులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు.

ఈ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులు ఈ చోరీ చేసినట్టు కనిపెట్టారు. కాగా ఈ చోరీని మద్యం బాబులు చేశారా, లేదా ఎవరైనా మద్యాన్ని బ్లాక్‌లో అమ్ముకునేందుకు చేసార అన్న విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఇటు వైన్స్ యాజమానులకు.. అటు పోలీసులకు కాస్త టెన్షన్ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories