Top
logo

Hyderabad: కరాచీ బేకరీలో చోరీ

Hyderabad: కరాచీ బేకరీలో చోరీ
X
Highlights

హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. షాప్ వెనుక ఉన్న షెటర్ తొలిగించి రూ....

హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. షాప్ వెనుక ఉన్న షెటర్ తొలిగించి రూ. 10 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చిన యజమాని తనిఖీ చేశాడు. అప్పటికే లాకర్‌లో ఉన్న డబ్బుతో దొంగలు ఉడాయించినట్టుగా గుర్తించారు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.

Web Titletheft at Karachi Bakery in Hyderabad
Next Story