Mid Day Meal: విద్యార్థుల ఇంటికే..మధ్యాహ్న భోజన బియ్యం..వంట ఖర్చులు కూడా చెల్లింపు!

Mid Day Meal: విద్యార్థుల ఇంటికే..మధ్యాహ్న భోజన బియ్యం..వంట ఖర్చులు కూడా చెల్లింపు!
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన కొన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన కొన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పడితే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ప్రభుత్వం చూస్తున్నప్పటికీ ఇప్పట్లో అది సాధ్యం అయ్యేట్టు కనిపించడంలేదు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ నిర్ణయానికి రానున్నాయి. సర్కారు బడులు నడిస్తే పిల్లలు మధ్యాహ్న భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు భోజనానికి సంబంధించిన బియ్యాన్ని విద్యార్థుల ఇండ్లకే పంపిణీ చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పెట్టే సన్న బియ్యాన్నే ఇప్పుడు వారి ఇండ్లకు పంపిణీ చేయడంపై రాష్ట్ర సర్కారుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగానే ప్రతి విద్యార్థికి నెలలో తరగతులు జరిగే రోజులతో 150 గ్రాముల చొప్పున లెక్కించి నెలకు మూడు కిలోలకుపైగా సన్న బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. లేదా నెలకు నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీచేసే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా విద్యార్ధులకు బియ్యంతో పాటు పప్పు దినుసులు, నూనె, ఇతర సామగ్రి, కూరగాయల ఖర్చులను కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.120 నుంచి రూ.130 వరకు వంట ఖర్చులను అందించనున్నారు. ఈ నగదును విద్యార్ధులు లేక వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమచేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది.

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యార్థుల ఇండ్లకు సన్నబియ్యం పంపిణీపై మార్గదర్శకాలు రూపొందించి, డీఈవోలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పద్ధతిని జూన్‌ లేదా జూలైనుంచి అమలుచేసే అవకాశాలున్నాయి. ఇక ఈ బియ్యం, వంట సామాగ్రి ఖర్చుల్లో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతంగా ఉండనుంది. ఇక పాఠశాల ప్రారంభం విషయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల దాకా బడులు ప్రారంభించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికే బియ్యం పంపిణీ చేయడం మంచిదని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories