గ్రేటర్ లో 'ఆర్టీసీ' సర్వీసుల కుదింపు

గ్రేటర్ లో ఆర్టీసీ సర్వీసుల కుదింపు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి అందరికీ విదితమే. సమ్మె సమయంలో రూ.165 కోట్ల నష్టం గ్రేటర్ ఆర్టీసీకీ వచ్చింది. దీంతో...

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి అందరికీ విదితమే. సమ్మె సమయంలో రూ.165 కోట్ల నష్టం గ్రేటర్ ఆర్టీసీకీ వచ్చింది. దీంతో ఆర్టీసీని నష్టాల ఊబినుంచి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఇదే కోణంలో ఇటీవల ఆర్టీసీ చార్జీలను పెంచింది.

చార్జీలు పెంచక ముందు రోజుకు రూ.3.06 కోట్ల ఆదాయం రాగా పెంచిన చార్జీలతో నెలలో ఆదాయం మరో రూ. 31 కోట్లు పెరుగనుందన్నారు.అయినప్పటికీ ఆర్టీసీ నష్టాలనుంచి బయటకు రాదని అంచనా వేసిన ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలను తేవాలని భావిస్తుంది. ఇప్పటివరకూ పెంచిన చార్జీలతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఖర్చులకు కూడా సరిపడకుండా ఉండే పరిస్థితి నెలకొందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంత చార్జీలు పెంచినా వచ్చే ఆదాయం కంటే అయ్యే ఖర్చులే ఎక్కువని అధికారులు సెలవిచ్చారు.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ విషయానికొస్తే సీటీ బస్సుల వలన ప్రతిరోజు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చార్జీలు పెంచడానికి ముందు ప్రతి నెలా రూ 96 కోట్ల రెవెన్యూ వచ్చేదన్నారు. కానీ నిర్వహణ భారం మాత్రం 145 కోట్ల రూపాయలు ఉండేదని అధికారులు తెలిపారు. చార్జీలు పెంచినప్పటికీ నెలకు రూ.18 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు.

దీంతో గ్రేటర్ ఆర్టీసీ కొన్ని రూట్లలో బస్సులను కుదించే ప్రయత్నాలు చేస్తుంది. అధికంగా రద్దీ లేని ప్రాంతాలలో బస్సులను ఉదయం 5 గంటల నుంచి కాకుండా 6 గంటల నుంచి నడిపించనున్నారు. తిరిగి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే బస్సులు రద్దీ లేని ప్రాంతాలలో తిరగనున్నాయి. ఏ రూట్లలో ఐతే బస్సులకు కుదిస్తారో ఆ రూట్లను అంచనా వేసి త్వరలోనే ప్రజలకు సమాచారం అందిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories