మల్లన్న సాగర్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

మల్లన్న సాగర్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
x
Highlights

రెండేళ్లుగా హైకోర్టులో నడుస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోర్టు వివాదం బుధవారం కొలిక్కి వచ్చింది. ఈ కేసుపై సంచలన తీర్పునిస్తూ హైకోర్టు ఆర్డర్ ను...

రెండేళ్లుగా హైకోర్టులో నడుస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోర్టు వివాదం బుధవారం కొలిక్కి వచ్చింది. ఈ కేసుపై సంచలన తీర్పునిస్తూ హైకోర్టు ఆర్డర్ ను జారీ చేసింది. 2018 సంవత్సరంలో రైతులు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో అభ్యంతరాలు తెలిపారు. అయినప్పటికీ వారి అభ్యంతారను పట్టించుకోకుండా అధికారులు ప్రాజెక్టు డిక్లరేషన్, అవార్డును ఇచ్చారు. దీంతో బాధిత రైతులు ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. కాగా కోర్టు అధికారులను మందలిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను రైతులకు తెలపాలని ఆదేశించింది. రైతులు ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిగణలోకి తీసుకోని విచారణ జరిపించాలని, తరువాతే ఆర్డర్‌ను రైతులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కానీ 2019 మే లో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులు వాటిని పాటించకుండా డిక్లరేషన్, అవార్డును ప్రకటించారు. దీంతో రైతులందరూ మరోసారి కోర్టు మెట్లు ఎక్కి తమకు న్యాయం జరిపించాలంటూ వాపోయారు.

దీంతో ఈ కేసు అప్పటి నుంచి నడుస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. అనంతరం సిద్దిపేట ఆర్డీఓ జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానాను కూడా విధించింది. అంతే కాకుండా సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు రూ. 2వేలు జరిమానా విధిస్తూ ఆర్డర్లను జారీ చేసింది. ఒక వేళ జరిమానాను నాలుగు వారాల లోపు కోర్టులో చెల్లించకపోతే ఒక నెల జైలు శిక్ష విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇకపోతే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న 12 మంది పిటిషనర్లకు అధికారులు రూ. 2 వేల చొప్పున నగదును చెల్లించాలని ఆదేశించింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories