ముగ్గురు ప్రముఖులకి గ్రీన్ చాలెంజ్ విసిరిన కలెక్టర్ రజత్ కుమార్ శైని

ముగ్గురు ప్రముఖులకి గ్రీన్ చాలెంజ్ విసిరిన కలెక్టర్ రజత్ కుమార్ శైని
x
Highlights

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని...

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇదే కోణంలో జోగినిపల్లి సంతోష్‌కుమార్ చెట్లను మరింత పెంచాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ విజయవంతంగానే కొనసాగుతున్నది. ఇదే నేపథ్యంలోనే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని బంగ్లా ఆవరణలో 3 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ‍యన మాట్లాడుతూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొక్కల సంఖ్య పెరిగి పచ్చదనం పెరుగుతుందని ఆయన అన్నారు. దీంతో వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని. మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు.

జిల్లాలో విస్తృతంగా హరితహారం కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. అందరూ మొక్కలను నాటాలని తెలిపారు. కలెక్టర్ రజత్ కుమార్ శైని మొక్కలను నాటిన తరువాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా ఎస్పీ, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories