ఇరుగు, పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్!

ఇరుగు, పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్!
x
నిర్మాణుష్యంగా రాష్ట్ర సరిహద్దులు
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ పిలువపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం అవ్వాల్సి ఉండగా. ప్రజలు మాత్రం...

ప్రధాని నరేంద్ర మోదీ పిలువపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం అవ్వాల్సి ఉండగా. ప్రజలు మాత్రం తెల్లవారుజామునుంచే ఇళ్లలోనుంచి బయటికి రాకుండా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ స్వచ్చందంగా పాటిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు తమ పనులు మానుకొని జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు. కూరగాయల మార్కెట్ల వారు మొదలుకొని మాంసం అమ్మకం దారులు వంటి చిరు వ్యాపారాలు సైతం స్వచ్చందంగా షాపులు మూసి వేశారు.

కర్ఫ్యూ తరువాత కూడా మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. కర్ఫ్యూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి, బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అలాగే దాదాపు రైళ్ళన్నీ శనివారం రాత్రి 10 గంటలనుంచే రద్దయ్యాయి. అయితే అంతకుముందు బయలు దేరిన రైళ్లను మాత్రం అధికారులు అనుమతించారు. అత్యవరస సేవలు వైద్యం, ఫైర్ సిబ్బంది వంటి సేవలను కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో రైళ్ల, వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదశ్ తెలంగాణ సరిహద్దుల్లో బందోబస్తును ఏర్పాటు చేసారు. హైదరాబాద్‌-విజయవాడ హైవేను ఆదివారం ఉదయం మూసేశారు.

అదే విధంగా తెలంగాణకు పోరుగున ఉన్న మరో రాష్ట్రం అయిన మహారాష్ట్రకు కూడా రవాణా అంతా స్థంబించిపోయింది. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఉన్న అన్ని బార్డర్లను మూసివేసారు. ఇక తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక రాష్ట్రంలోని అన్ని బస్టాపులు, రైల్వేస్టేషన్లు, రోడ్లన్నీ జనతా కర్ఫ్యూ కారణంగా నిర్మాణుష్యంగా మారిపోయాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories