Top
logo

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత
Highlights

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు రగిలిపోయారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన...

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు రగిలిపోయారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న బస్‌ను కార్మికులు అడ్డుకున్నారు. అద్దాలను ధ్వంసం చేశారు. తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాదేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఆ డ్రైవర్‌ తప్పించుకున్నారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ మధ్యాహ్నం డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో అతడి శరీరం 90 శాతం కాలిపోయింది. వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై ఆందోలన చేపట్టారు.

Next Story