గుండెపోటుతో మరో ఆర్టీసీ కండక్టర్ మృతి

గుండెపోటుతో మరో ఆర్టీసీ కండక్టర్ మృతి
x
Highlights

♦ ఆత్మకూరులో ఉద్రిక్తత ♦కండక్టర్ రవీందర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు ♦ఇద్దరు డీసీపీలు, ముగ్గరు ఏసీపీలు, 100 మంది పోలీసులతో బందోబస్తు

కండక్టర్ రవీందర్ మృతితో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత నెలకొంది. కండక్టర్ రవీందర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇద్దరు డీసీపీలు, ముగ్గరు ఏసీపీలు, 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలు త్వరగా పూర్తి చేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే బంధువులు అందరు వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని కండక్టర్ రవీందర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన రవీందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వచ్చేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పెంచారు. కండక్టర్ రవీందర్ మృతితో పరకాల ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories