ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగాలు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగాలు
x
Highlights

నిరుద్యోగులకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

నిరుద్యోగులకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు (తెలుగు), న్యూస్‌రీడర్ల (తెలుగు, ఉర్దూ) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకునే వారు హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో నివాసితులై ఉండాలని ఆకాశవాణి కేంద్రం తెలిపింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే న్యూస్‌రీడర్లు కావాలనుకున్నవారికి పరీక్షతో పాటు వాయిస్ టెస్ట్ (ఆడిషన్) కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించాలని వారు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 16వ తేదీన ముగియనున్నాయని ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.newsonair.com వెబ్‌ సైట్‌లో వేకెన్సీ విభాగాన్ని పరిశీలించాలని కోరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories