తాత్కాలికంగా మూసివేసిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌ హైదరాబాద్
x
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌ హైదరాబాద్
Highlights

కొద్దిరోజుల క్రితమే కేటీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌ను తాత్కాలికంగా మూసివేశారు.

నవంబర్ 3 వ తేదీన కేటీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌‌ను తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో ఈ ఫ్లైఓవర్ ఒకటి.

ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. అయితే నూతనంగా ప్రారంభిచిన ఈ ఫ్లైఓవర్ పైన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన అనంతరం ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొంతమంది అధికారులు ప్రకటించారు. ఇంకొన్ని రోజుల తరువాత ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడి చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories