Top
logo

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. చలికి వణికిపోతున్న ఏపీ, తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. చలికి వణికిపోతున్న ఏపీ, తెలంగాణ
X
Highlights

తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. చలికి ప్రజలు ఇంట్లో ముసుగు వేసుకొని కూర్చుంటున్నారు. ఉదయం 8 దాటితే...

తెలుగు రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. చలికి ప్రజలు ఇంట్లో ముసుగు వేసుకొని కూర్చుంటున్నారు. ఉదయం 8 దాటితే తప్ప కాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య మంచు ప్రభావంతో రోడ్లన్నీ కనిపించకుండా పోతున్నాయి. తెలంగాణలో రెండ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు చేరింది. అక్కడి అటవీ ప్రాంతాల్లో 2 డిగ్రీలుగా ఉంది. మరో ఐదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి.

ఏపీలో చల్లగాలులకు ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పగటి పూట వాతావరణం చల్లగా మారిపోయింది. ఇక రాత్రిపూట చలి తీవ్రంగానే ఉంది. రెండు రోజులుగా రాత్రాంతా మంచు విపరీతంగా కురుస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండడంతో ఎముకలు కొరికేలా చల్ల గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో ప్రయాణాలు సాగించేవారు, కొండవాలు ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలిని తట్టుకునేందుకు జర్కిన్లు, చేతులకు గ్లౌజులు, రగ్గులు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో చలి లేదని ప్రజలు అంటున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈఏడాది వరుసగా కొన్ని రోజులపాటు 15 డిగ్రీల్లోపు ఉషోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Web TitleTemperatures decline in two Telugu states
Next Story