నువ్వు సూర్యుడివా యుముడివా..

నువ్వు సూర్యుడివా యుముడివా..
x
Highlights

సమాజంలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే చాలు నెటిజన్లు సినీ తారల ఫోటోలు పెట్టి మీమ్‌ లను పోస్ట్ చేస్తూ ఉంటారు.

సమాజంలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే చాలు నెటిజన్లు సినీ తారల ఫోటోలు పెట్టి మీమ్‌ లను పోస్ట్ చేస్తూ ఉంటారు. అది కామెడీ కానీ, సాడ్ కానీ ఇతరులను ఆకట్టుకునేలా చేస్తారు. ఇప్పుడు ఇదే తరహా ఒక మీమ్‌ నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అగ్గిలా మండుతున్న ఎండలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దానికి తోడు వడ గాలలు రావడంతో ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఇండ్ల నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఈ ఏండల తీవ్రతకు తట్టుకోలేక కొన్ని ప్రాంతాల వారు ఎన్ని ఫ్లాన్లు, కూలర్లు, ఏసీలు వేసినా అవికూడా పని చేయడం లేదు.

ఇక పట్టణం విషయానికొస్తే ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండంతో ఉక్కపోతకు తోడు.. వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లను వినియోగించాలని ఉన్నా వాటికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో నగరంలో ఉండే వారు అటు వేడిని తట్టుకోలేక, ఇటు తమ వేడి బాధను ఎవరికీ చెప్పుకోలేక ఏదో నవ్వుకోవడం కోసం సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రూపంలో వెళ్లక్కుతున్నారు.

ఇలా అప్ లోడ్ చేసిన మీమ్ లలో ప్రస్తుతం ఓ మీమ్ నెటిజన్ల ఫోన్లలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. హాస్యనటుడు బ్రహ్మానందం ఫొటోతో ఉన్న మీమ్‌ లో ఏం ఉందంటే 'నువ్‌ సూర్యుడివా యముడివా.. అలా మండుతున్నావ్‌ ఏంటి.. నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్‌'అంటూ ఉన్న ఓ మీమ్ ని పోస్ట్ చేసారు. అసలే హాస్యనటుడు బ్రహ్మానందం కామెడీ అంటే ప్రతి ఒక్కరు చెవి కోసుకుంటారు. ఆయన హావభావాలు చూసి పడి పడి నవ్వుకుంటారు. అందుకే నేమో ఈ ఎండలో కాస్తయినా రిలాక్స అవ్వడానికి నెటిజన్లు ఇది పోస్ట్ చేసినట్టున్నారు.

ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రతలు ప్రతి రోజు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉష్టోగ్రతలను చూసుకుంటే నిజామాబాద్‌ 43, మెదక్‌ 42, వరంగల్‌ 44, హైదరాబాద్‌ 42, కరీంనగర్‌ 44, రామగుండం 43, నల్గొండ 44, విజయవాడ 42, విశాఖ 34, తిరుపతి 41, రాజమండ్రి 41, ఒంగోలు 42, నెల్లూరు 42, కర్నూలు 41, అనంతపురం 41, కడప 42, ఏలూరు 42, విజయనగరం 36, శ్రీకాకుళం 36 డిగ్రీల చొప్పున శుక్రవారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories